కుల గణనతోనే సామాజిక న్యాయం 

కుల గణనతోనే సామాజిక న్యాయం 

విశ్వంభర, బషీర్ బాగ్ : కులగణన, సామాజిక న్యాయంపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఈ పుస్తకం మేధోపరమైన తోడ్పాటుగా నిలుస్తుందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) ఆధ్వర్యంలో 'క్యాస్ట్ సెన్సెస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్' అనే పుస్తకావిష్కరణ సభ  న్యూఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పీకర్స్ హాల్‌లో నిర్వహించారు. ఏఐఓబీసీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, డా.వాహిని బిళ్లు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకాన్ని లోక్‌సభ సభ్యుడు మల్లు రవి, రాజ్యసభ సభ్యులు పి.విల్సన్, ఆర్.కృష్ణయ్య, సంజయ్ సింగ్, జాతీయ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ, ఓబీసీ హక్కుల ఉద్యమ నాయకురాలు రత్నా సెతుపతి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, ప్రొ.సూరజ్ మండల్, ప్రొ.సందీప్ యాదవ్, అడ్వకేట్ శశాంక్ రత్నూ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కులగణన కోసం జరుగుతున్న డిమాండ్ భారత ప్రజాస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడానికి సామాజిక న్యాయాన్ని సాధించడానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. నమ్మకమైన కుల ఆధారిత గణాంకాలు ఉండడం వల్ల ఆధారభూత విధాన నిర్ణయాలు తీసుకోవడం, రిజర్వేషన్ల సమర్థ అమలు, అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక అసమానతలను పరిష్కరించడం సాధ్యమవుతుందని వారు అన్నారు. దేశంలో కులగణన అవసరం, సామాజిక న్యాయం పోషించే పాత్రపై విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, బ్యూరోక్రాట్లు, పరిశోధకులు, విద్యార్థుల అభిప్రాయాలను ఈ గ్రంథం సమగ్రంగా సమీకరించిందని కిరణ్ కుమార్, డా. వాహిని తెలిపారు.

Tags: