అన్ని రకాల ధాన్యాలకు బోనస్ అందించాలి.

అన్ని రకాల ధాన్యాలకు బోనస్ అందించాలి.

విశ్వంభర/కౌకుంట్ల:-కాంగ్రెస్ పార్టీ రైతులపై కపట ప్రేమను నిరసిస్తూ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల ప్రకారం దేవరకద్ర నియోజకవర్గం ఇంచార్జ్ ఆల వెంకటేశ్వర్ రెడ్డి చొరవతో  బిఆర్ఎస్ కౌకుంట్ల మండలం కేంద్రంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రెసిడెంట్ కేబీఆర్ గౌడ్ మాట్లాడుతూ మొదట గ్రామ అధ్యక్షుడు శివకుమార్ కి  ధన్యవాదాలు తెలిపారు. అలాగే 33 రకాల ధాన్యం పండిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఏడు రకాల ధాన్యాలకే బోనస్ ఇస్తామనడం, కేంద్రం చేతుల్లో కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా మారి కేంద్రం కోటాను దాటకుండా వడ్లు కొనం అని చెప్పడం శోచనీయంగా ఉందని ప్రభుత్వంపై నిరసన ñవ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బీమా రైతు బంధు పథకాలు సక్రమంగా వచ్చేవని కాంగ్రెస్ హయాంలో ప్రీమియం చెల్లించినందుకు రైతు బీమా రావట్లేదని ప్రభుత్వాన్ని దూయబట్టారు. కేంద్రం చెబితే ధాన్యం కొంటారా అని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని రైతులకు మేలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని లేని పక్షంలో ప్రభుత్వాని కి బిఆర్ఎస్ తరఫున అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ MPTC  కిష్టన్న, కౌకుంట్ల మండల అన్ని గ్రామాల అధ్యక్షులు బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం ఆనంద్ యాదవ్, కౌకుంట్ల మండలం యూత్ ప్రెసిడెంట్ శేరి శేఖర్ రెడ్డి, నందు గౌడ్, ఓబీసీ సెల్ నరేందర్ గౌడ్ పుట్టపల్లి గ్రామ అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్, మండలమైనార్టీ అధ్యక్షులు వాజిద్ అలీ, భాస్కర్ తిరుమలాపూర్ గ్రామ అధ్యక్షులు, కౌకుంట్ల మండల ఎస్సీ సెల్అధ్యక్షులు బంటు రాజు మరియు ఇతర టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 21 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/all-kinds-of-grains-should-be-given-bonus/article-16813

Tags: