సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపిన రాపోలు వీర మోహన్ -  చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల

సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపిన రాపోలు వీర మోహన్ -   చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల

విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన సీఎం రేవంత్ కు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్  ధన్యవాదాలు తెలిపారు. చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల చెయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లు నిధులు రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల అప్పులు తీర్చేందుకు వీటిని వినియోగించనున్నారు. నిధుల విడుదలపై చేనేత ఐక్య వేదిక వేదిక ,  చేనేత కార్మికులు ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు.

Tags: