విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
On
విశ్వాంభర,పెద్ద శంకరంపేట: మండల పరిధిలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గా అవంతిక ప్రధానోపాధ్యాయులుగా శివ సాయి, ఉపాధ్యాయులుగా చరణ్, కృష్ణ ,శివ సాయి, మణిందర్, బాబు, ప్రేమలత, సంధ్య, సుజన్, దీక్షిత, భాను శ్రీ వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ , స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యత భావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు ,దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సుజిత్ కుమార్, ఉమాప్రసన్నలు పర్యవేక్షించారు.



