భాంధవి లడాఖ్ బైక్ యాత్రక
విశ్వంభర, హైదరాబాదు : యువత కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగాలని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాదు కు చెందిన ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని మెట్టు భాంధవి లడాఖ్ బైక్ యాత్రను ప్రారంభించి అభినందనలు తెలిపారు. భాంధవి హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లడాఖ్ వరకు మోటార్‌సైకిల్ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో 10 మంది రైడర్లు పాల్గొంటుండగా, హైదరాబాదు బృందం నుంచి సుప్రియా, కార్తీక్, కైవల్య, మౌనిక, నవ్య, పల్లవి తదితరులు భాగస్వాములు కానున్నారు. లడాఖ్ వంటి క్లిష్ట ప్రాంతంలో యాత్ర చేపట్టడం సంకల్పబలం, పట్టుదలకు నిదర్శనమని, యువతలో ఆత్మవిశ్వాసం, సాహస స్ఫూర్తి పెంపొందించడంలో ఇటువంటి ప్రయాణాలు కీలకమని పేర్కొన్నారు. యువతులు ధైర్యంగా ముందుకు సాగగలరనే సందేశాన్ని ఈ యాత్ర ఇస్తోందన్నారు. యాత్రను విజయవంతంగా పూర్తిచేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సుప్రియా, నవీన్ గౌడ్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.