ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
విశ్వంభర, గుండాల : ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలో సీటు సాధించిన వంగాల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చిప్పలపల్లి మోక్షిత, చిప్పలపల్లి యక్షలను గ్రామ సర్పంచ్ చిప్పలపల్లి యాదమ్మ నరసింహ అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. సి ఆర్ పి దేవన బోయిన లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ చిప్పలపల్లి యాదమ్మ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుంది అనడానికి నిదర్శనమే ఈ విద్యార్థులు సాధించిన గురుకుల సీట్లు అని అన్నారు. పాఠశాల హెడ్మాస్టర్ కే మౌనికను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు ఇంకా మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా మన ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిప్పలపల్లి జానీ వేగం రవిశంకర్, ఉప సర్పంచ్ జటంగి నాగరాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి జి అనిత, వార్డ్ మెంబర్ చిప్పలపల్లి సోమ నరసయ్య గ్రామ పెద్దలు చిప్పలపల్లి నరసింహ, సోమన్న, స్వామి, వీరబోయిన లింగమల్లు, గణేష్, రవిశంకర్, శ్రావణి, నిర్మల తదితరులు పాల్గొన్నారు .



