విద్యార్థులకు క్రీడా  దుస్తుల పంపిణీ 

విద్యార్థులకు క్రీడా  దుస్తుల పంపిణీ 

విశ్వంభర, మహబూబాబాద్ : కొరివి మండలం నేరడ గ్రామం ఆదర్శ మోడల్ స్కూల్ , జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఖమ్మం పట్టణానికి చెందిన జీవి మాల్ యాజమాన్యం , విశిష్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తువులు 50 మందికి  పైగా విద్యార్థులకు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా నేరడ మోడల్ స్కూల్  ప్రిన్సిపాల్  డాక్టర్ వై శ్రీకాంత్ మాట్లాడుతూ,  మా పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పెనుగొండ ఉపేందర్ రావ్, తెల్లాకుల కోటేశ్వరరావు వీరు  ఖమ్మం పట్టణానికి చెందిన  విశిష్ట ఫౌండేషన్ జీవి మాల్ యాజమాన్యం  గుర్రం సీతామాలక్ష్మి శ్రీనివాస్ , కుటుంబ సభ్యులు శశికళ లీలా లాస్య  లని కలవగా అప్పుడు వీరు మా పాఠశాలనీ సందర్శించి విద్యార్థులకు 50 పైన క్రీడ దుస్తులను పంపిణీ చేశారని  చెప్పారు. విశిష్ట ఫౌండేషన్ వారు మాట్లాడుతూ, మాకు  తోచినంత సహాయం విద్యార్థులకు చేయాలనిపించి తమ వంతు సాయం చేశామని , ఇంకా ఎప్పుడైనా మాతో ఏ అవసరం వచ్చిన మా సంస్థను సంప్రదించవచ్చని , స్కూల్ ప్రిన్సిపాల్ , అధ్యాపక బృందాన్ని విద్యార్థులని కోరారు . ఈ కార్యక్రమంలో నేరడ గ్రామ సర్పంచ్ ఇరుగు గౌతమి, ఉప సర్పంచ్ వెంకన్న, కురవి మండల  విద్యాశాఖ అధికారి బాలాజీ , జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి , ఇంకా పలువురు ఫౌండేషన్ వారిని అభినందించారు .

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-sports-clothes-to-students/article-18610

Tags: