అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయండి

విశ్వంభర,  పెద్దపల్లి :  ఈనెల 19తారీకున ఎన్.టి.పి.సి లో జరిగే కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట్ గ్రామంలోని సి.పి.ఐ (ఎం-ఎల్) న్యూడెమాక్రసీ కార్యాలయంలో "కరపత్రాలు" విడుదల చేసారు. ఈ  సమావేశానికి ఎ.ఐ.కె.ఎం.ఎస్ నాయకులు మేరుగు చంద్రయ్య, పి.వై.ల్ నాయకులు ఆరుమూల్ల తిరుపతి లు హాజరై మాట్లాడుతూ.. కామ్రేడ్  నాగన్న  ఖమ్మం జిల్లా లోని రాజారాం గ్రామంలో నిరుపేద కల్లుగీతా కార్మిక కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పాలేరు నుండి పార్టీ రాష్ట్ర నాయకునిగా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా, కార్యదర్శి గా ఎదిగాడని చెప్పారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా అనేక నిర్బందాలు, చిత్రహింసలు ఎదురైన రైజ్యానికి లొంగకుండా తుది స్వాసవరకు నూతన ప్రజాస్వామిక విప్లవం, సమ సమాజ స్తాపన కోసం ప్రజల్లో చైతన్యం నింపడాని తన ఆటా, పాట ద్వారా అరుణోదయ నాగన్న గా పేరొందాడాని, నాగన్న ఆశయసిద్దికై యువత ముందుండి పోరాడాలని, ఇందుకై ఈనెల 19న ఎన్టిపిసీ ఐఎఫ్టీయు ఆఫీస్ ముందు జరిగే "సంతాపసభ"కు జిల్లా వ్యాప్తంగా అదిక సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ నాయకులు ఈదునూరి బాబు, దూలం సతీష్, నల్లతీగల రమేష్, బండి సతీష్, బండి శ్రావణ్, కోడిపుంజుల శ్రావణ్, పి క్రాంతికుమార్, ఎ రాకేష్, రాము, పెద్దంపేట్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజుల భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/consecrate-arunodaya-naganna-santapa-sabha/article-18645

Tags: