చలివేంద్రాన్ని ప్రారంభించిన పూజల
On
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో డీసీసీ నాయకుడు షాబుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజల మాట్లాడుతూ మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రజల పట్ల బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కాంగ్రెస్ నాయకుల సంప్రదాయమని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బొమ్మల యాదగిరి, కలీముద్దీన్ అహ్మద్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, మేరుగు రాజు, సీత బాలు, శ్రీనివాస్, అంబటి మహేష్, చిన్నకోడూరు మండల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బుస్సా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



