వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలి
On
విశ్వంభర, సిద్దిపేట: గురుకుల విద్యాలయం, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. వంటలను పరిశీలించి గ్యాస్‌ను వృధా చేయకుండా పొదుపుగా వాడి వంటలను వేడివేడిగా విద్యార్థులకు వడ్డించాలన్నారు. విద్యార్థులు అన్నం తినక ముందు, తిన్న తర్వాత డైనింగ్ రూమ్‌లను శుభ్రం చేయాలని చెప్పారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, కూరగాయలను పరిశుభ్రమైన ప్రాంతాల్లో శుభ్రం చేసి వంటకు ఉపయోగించాలని ప్రిన్సిపాల్, వంట సిబ్బందికి సూచించారు.



