ప్రభుత్వ పాఠశాలకు బెంచీల వితరణ
విశ్వంభర, హైదరాబాద్ : ఎస్జెసి చారిటబుల్ ట్రస్ట్ రెండు లక్షల విలువగల 50 స్టీల్ డ్యూయల్ డెస్క్ బెంచీలను సరూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇచ్చారు. ఎస్జెసి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు బూరుగు నాగ శ్రీధర్, సిరీస్ జవ్వాజి, బూరుగు శ్రీ నగేష్, శ్రీనివాస్ సాలికే, రవళి సోమ, ధీరజ్ సరూర్ నగర్ పాఠశాలకు విచ్చేసి విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు కె. రాములుకు డ్యూయల్ డెస్క్ బెంచీలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానోపాధ్యాయులు సూర్యపల్లి ఉమాదేవి, ఎంఇఓ బాసునాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వసంత, ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సత్తయ్య, నారాయణ, బాలనరేందర్, కవిత, రాధ, శోభ, వెంకటేశ్, రోజ, భాగ్యమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్జెసి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి బూరుగు నాగ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మీరు చదువుకుంటున్న పాఠశాలకు సమాజ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ బెంచీలు మీ తర్వాత వచ్చే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళకు ఉపయోగపడేటట్లు వీటిని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలిపారు.



