ప్రెస్ క్లబ్బా..? ప్రయివేటు క్లబ్బా..?

ప్రెస్ క్లబ్బా..? ప్రయివేటు క్లబ్బా..?

  • - టిడబ్ల్యూజెఎఫ్  డిమాండ్
  • - కలెక్టర్ తక్షణ విచారణ చేయాలి

విశ్వంభర, ఖమ్మం:  ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో జరుగుతున్న వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. జర్నలిస్టుల ఉమ్మడి వేదికగా ఉండాల్సిన ప్రెస్ క్లబ్‌ను కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని ‘ప్రైవేట్ క్లబ్’లా నడుపుతున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్-2843) జిల్లా కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు టి. సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణలు లోకల్ బాడీస్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సభ్యత్వాల పేరుతో రూ.1000 నుంచి రూ.3000 వరకు ఎటువంటి నిబంధనలు, రశీదులు లేకుండా అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ తక్షణం జోక్యం చేసుకుని ప్రెస్ క్లబ్‌లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమ వసూళ్లపై ఆడిట్ నిర్వహించి లెక్కలు బహిర్గతం చేయాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, నగర అధ్యక్షులు గెంటేల కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, నాగకృష్ణ, శ్రీధర్, ఎలుగోటి వెంకట్, చిన్నంశెట్టి రాంబాబు,రవి, మొగిలి నాగేశ్వర రావు, ఎం.ఎస్. చిన్ని, మామిడాల వీరబాబు, తానంగి భిక్షం, పాగ యోనా, తిరుపతి కొండలరావు, పి.శ్రీను, సవల బాలరాజు, నీరుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు