బీసీ గురుకుల పాఠశాల తనిఖీ

బీసీ గురుకుల పాఠశాల తనిఖీ

విశ్వంభర, సిద్దిపేట: వర్గల్ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీని కలెక్టర్ హైమావతి సోమవారం ఆకస్మికంగా తనిఖీచేసి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లె చెట్లు, వివిధ రకాల పూలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలం దృష్టా నీరు బాగా పెట్టాలని సూచించారు. గురుకుల వాతావరణం చెట్లతో ఆహ్లాదకరంగా ఉందని అభినందించారు. అన్నం, వంకాయ, పాలకూర పప్పు, రసం, గుడ్డు, పెరుగులను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ రోజు విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు పంపిణీ చేసి రుచికరంగా వండే విధంగా చూసుకోవాలని, ప్రతీ వంటకం విద్యార్థులకు సరిపోయేలా వండాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసి భోజనం చేశారు. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ఎలా ఉంటాయని, వసతుల విషయంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఆరా తీశారు. స్టోర్ రూమ్ సరుకులు తనిఖీచేసి బియ్యం, పప్పులు ఇతరత్ర సామగ్రి చెడిపోకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.

Tags:  

Advertisement

LatestNews

చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు
రూ. 4.70 లక్షల విలువైన  గుట్కా పట్టివేత