బాధిత కుటుంబానికి పరామర్శ 

బాధిత కుటుంబానికి పరామర్శ 

విశ్వంభర, మోత్కూర్:  గుండాల మండల పరిధిలోని వస్తాకొండూర్ ప్రాథమిక పాఠశాలలో  ఎస్జిటి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న కూరెళ్ల ఎల్లయ్య ఇటీవలే గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందారు.  విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు సురారపు నరేష్ మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని వారి నివాసంలో ఏర్పాటుచేసిన దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు.  ఈ కార్యక్రమంలో వారి వెంట గుండాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిరిపురం దశరథ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చిప్పలపల్లి శంకర్ ఎమ్మార్పీఎస్ నాయకులు చెట్టిపల్లి యాదగిరి చెట్టిపల్లి మల్లేష్ తదితరులు ఉన్నారు.

Tags: