మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం 

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం 

విశ్వంభర, చింతపల్లి : అనారోగ్యంతో మరణించిన ఐతమోని సత్తయ్య మృతదేహానికి తీదేడు గ్రామ మాజీ సర్పంచ్ కాయితీ జితేందర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా  నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తన వంతుగా 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పి, ఎలాంటి సహాయం అవసరమైనా తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ దాసరి శ్రీనివాస్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు శివర్ల శంకర్, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చింతకుంట్ల రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేలపట్ల మురళి, గుణమోని శ్రీనివాస్, గంటల నరేష్, ఐతమోని వెంకటయ్య, సందే బిక్షం, ఐతామోని భరత్ తదితరులు ఉన్నారు.

Tags: