రూ.30వేల లంచం..

రూ.30వేల లంచం..

  • తీగలాగితే అల్మారాలో నోట్ల కట్టలు..!

 విశ్వంభర,  రాయగడ పట్టణం: ఒడిశాలోని ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు లభించడం తీవ్ర కలకలం సృష్టించాయి. రూ.30వేల లంచం కేసులో తీగ లాగితే.. ఆ అధికారి అవినీతి వ్యవహారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఒడిశాలోని కటక్ సర్కిల్ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న దేబబ్రత మహంతిని అవినీతి కేసులో విజిలెన్స్‌ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. లైసెన్స్ పొందిన ఓ బొగ్గు విక్రేత నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఆయన విజిలెన్స్ అధికారులకు చిక్కారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం ఉదయం మహంతి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇందులో భారీ ఎత్తున లెక్కల్లో రాని నగదు బయటపడింది. భువనేశ్వర్‌లోని ఆయన అపార్ట్‌మెంట్‌లో అల్మారాలో దాచిన రూ.4 కోట్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయన కార్యాలయంలోని టేబుల్‌లో మరో రూ.1.20 లక్షల నగదును గుర్తించారు. భువనేశ్వర్‌లో మరో రెండంతస్తుల భవనం, 130 గ్రాముల బంగారం గుర్తించినట్లు విజిలెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థాయిలో నోట్ల కట్టలను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

Tags: