పోలియో రహిత తెలంగాణే లక్ష్యం :కేపీ మురళీకృష్ణ

విశ్వంభర, బర్కత్ పుర : పోలియో రహిత తెలంగాణ సాధనే ప్రభుత్వ లక్ష్యం, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేపీ మురళీకృష్ణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా సోమవారం అంబర్‌పేట్ నియోజకవర్గం నల్లకుంట డివిజన్‌లోని బర్కత్ పుర రత్ననగర్, సత్యానగర్ బస్తీలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్య, వైద్యం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు, ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో: కాంగ్రెస్ నాయకులు టీ లాలయ్య గౌడ్ రాజేష్ లాల్ ఆశా వర్కర్లు ఉపేంద్ర సౌమ్య నాగమణి పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/polio-free-telangana-is-the-goal-of-kp-muralikrishna/article-17322

Tags: