పెండింగ్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి.. శంషాబాద్‌లో ఏబీవీపీ ఆందోళన

  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన ఏబీవీపీ
  • విద్యార్థుల హక్కులను కాపాడాలి.. శంషాబాద్‌లో ఏబీవీపీ నిరసన

ABVP Shamshabad: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం శంషాబాద్ జిల్లా ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్ కోటి ప్రదీప్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.11,000 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపించిన ఆయన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రధాన లక్ష్యాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఒకటేనని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని అన్నారు. ఉచిత పథకాల కంటే విద్యార్థుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read More చిన్న వానకే 25వ  వార్డు రోడ్డు చిత్తడి

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని, అవి విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులని కోటి ప్రదీప్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వారి భవిష్యత్తుతో రాజకీయం చేస్తే ఏబీవీపీ సహించదని పేర్కొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pending-scholarships-should-be-released-immediately-abvp-agitation-in-shamshabad/article-19669

Tags: