బాగ్‌లింగంపల్లిలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు

  • మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. విద్యార్థులకు శ్రీనివాస్ గౌడ్ సూచన.
  • సామాజిక చైతన్యం పెంచే పోటీలు విద్యార్థులకు అవసరం: శ్రీనివాస్ గౌడ్.

Sundarayya Vignana Kendram: హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ క్రీడల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చదువుతో పాటు సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, భవిష్యత్ భారత్ వంటి అంశాలపై నిర్వహించిన పోటీలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, అవగాహన పెంపొందించడంలో దోహదపడతాయని తెలిపారు.

నల్లకుంట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల ముఠాలు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వివిధ మార్గాల్లో వ్యసనాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నాయని హెచ్చరించారు. విద్యార్థుల ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ జోనల్ స్థాయి పోటీల్లో బాగ్‌లింగంపల్లి, నల్లకుంట ప్రాంతాలకు చెందిన 135 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో కే. వీరయ్య, పాండవుల నాగేశ్వరరావు, డి. సైదులు, పి. శ్రీనివాసరావు, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థులు కంప్యూటర్ బహుకరణ

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/essay-drawing-competitions-for-students-in-baglingampally/article-19671

Tags: