నీట్ లీకేజీపై సీపీఐ నిరసన
- ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్య విరుద్ధం
విశ్వంభర, హిమాయత్ నగర్: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్య విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను నిరసిస్తూ గురువారం సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాదు హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం కాకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలు తగవని అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ, వరుసగా నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు జరుగుతున్నందున కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగిస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ మాట్లాడుతూ, విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడకుండా వారి న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్య పద్మ ఈ.టి. నరసింహ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కలవేన శంకర్ బాగం హేమంత్‌రావు వి.ఎస్. బోస్ నెల్లికంటి సత్యం బొమ్మగాని ప్రభాకర్ పాలమాకుల జంగయ్య దండి సురేష్ అందోజు రవీంద్రాచారి మంద పవన్ తాండ్ర సదానందం కలకొండ కాంతయ్య ఆర్. అంజయ్య నాయక్ కర్రే బిక్షపతి ఎస్. బాలరాజు జ్యోతి బి. స్టాలిన్ విజయలక్ష్మి పండిట్ ముత్యాల యాదిరెడ్డి ఎం. అనిల్ కె. ధర్మేంద్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.