పెండింగ్‌లో ఉన్న సమీకృత శాఖాహార–మాంసాహార మార్కెట్ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలి
- హుస్నాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన సమీకృత శాఖాహార–మాంసాహార మార్కెట్ భవనాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ రూ.2.70 కోట్ల వ్యయంతో 2022 ఫిబ్రవరిలో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ శంకుస్థాపన చేసిన ఈ భవనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే పనులను రాజకీయాలకు అతీతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా చేపల మార్కెట్ నిర్వహిస్తున్న వ్యాపారులకు మున్సిపల్ అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, పెండింగ్‌లో ఉన్న మార్కెట్ భవనాన్ని పూర్తి చేస్తే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి సమీకృత మార్కెట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిత్తారి శ్రీనివాస్, యాస శ్రీనివాస్, మేకల వికాస్ యాదవ్, అయిలేని గాల్ రెడ్డి, భూక్యా రాజు నాయక్, మార్క శ్రీనివాస్ గౌడ్, కనుక రాజు, సుకూర్, మాటూరి రాజశేఖర్ గౌడ్, చేపల వ్యాపారులు ముద్రవేణి సుగుణ, చొప్పరి వెంకటయ్య, హరిత, పెసరి నిరోషా తదితరులు పాల్గొన్నారు.