రాహుల్ గాంధీ అరెస్టుపై గుండాలలో కాంగ్రెస్ నిరసన
విశ్వంభర, గుండాల: రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ గుండాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు, అనంతరం ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఈ అక్రమ అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏలూరి రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి పోడిశెట్టి వెంకన్న, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిందం ప్రకాష్, సర్పంచులు గద్వాల ఉపేందర్, గూడెపు కుమార్, లింగాల అనిల్ కుమార్ గౌడ్, కాళీ మంజుల, ఆంజనేయులు, తాండ్ర నారాయణస్వామి, వల్లాల రమేష్, పీఏసీఎస్ డైరెక్టర్లు పొనగాని నారాయణ, అన్యపర్తి యాదగిరి, నూనె ముంతల యాదయ్య, మాజీ ఎంపీపీ సంఘీ వేణుగోపాల్ రావు, హరిత దేవి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కుమ్మరికుంట్ల రాజారత్నం, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.