నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : నీట్ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, పరీక్షా విధానంలో పారదర్శకతను తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ నాయక్ అన్నారు. హైదరాబాదులోని బాగ్‌లింగంపల్లిలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నీట్ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న అవకతవకలతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రతిభకు ప్రాధాన్యం కల్పించేలా పరీక్షల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని, లీకేజీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలో నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను ఆయన ఖండించారు. విద్యార్థుల సమస్యలకు మద్దతుగా వెళ్లిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలపై పోలీసులు తీసుకున్న చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయకుండా వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని, పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల్లో తిరిగి నమ్మకం కల్పించే చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో: లోకేష్ యాదవ్, అంజి యాదవ్, నాగభూషణ్, రాజు, వర్మ, జబ్బార్, కన్నా, బబ్లు, ప్రేమ్ కుమార్, భూపాల్, శ్రీకర్, విద్యార్థులు,, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.