రైతులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి: కుల్కచర్ల మండల కేంద్రంలోని పీఎసీఎస్ కార్యాలయంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 16 మంది రైతులకు సుమారు రూ.72 లక్షల విలువైన పిఎసిఎస్ ఎల్టి లోన్ చెక్కులను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, సహకార సంఘాల ద్వారా అందిస్తున్న రుణాలు రైతులకు ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తాయని అన్నారు.రైతులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ భీమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ నాయక్, కమిటీ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.