రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాయికోటి రాజు
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం 40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా బ్యాలెట్ పద్ధతిలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. గురువారం ఎల్బీనగర్‌లో జరిగిన ఎన్నికల్లో నాయికోటి రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రిటైర్డ్ సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 43 ఓట్లు పోలవగా, నాయికోటి రాజుకు 23 ఓట్లు, పారేపల్లి నాగరాజుకు 15 ఓట్లు లభించాయి. దీంతో నాయికోటి రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా విజయం సాధించారు. విజయం అనంతరం రాష్ట్రంలోని జిల్లా నాయకులు నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయికోటి రాజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. డీలర్ల హక్కుల పరిరక్షణ, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి రేషన్ డీలర్‌కు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.