నేడు ఆమ్ ఆద్మీ జన చైతన్య సభ
విశ్వంభర, హిమాయత్‌నగర్ : జన చైతన్య సభను విజయవంతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో నిర్వహించనున్న జన చైతన్య సభకు సంబంధించిన గోడపత్రికలను గురువారం హైదరాబాదు హిమాయత్‌నగర్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హేమా సుదర్శన్ జిల్లోజు మాట్లాడుతూ, సభకు పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రియాంక కక్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. సభలో నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, అవినీతి రహిత పాలన, ఉపాధి అవకాశాలు, ప్రజా సంక్షేమం, ప్రత్యామ్నాయ రాజకీయాలపై పార్టీ విధానాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ప్రజలు, యువత, మహిళలు, రైతులు, మేధావులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో: ఆమ్ ఆద్మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా ముమ్ము గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హైదర్, అధికార ప్రతినిధి ప్రశాంత్ రాజ్, రాకేష్ రెడ్డి, దర్శనం రమేష్ పాల్గొన్నారు.