అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి 

  • మూడు జిల్లాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

విశ్వంభర,  హుస్నాబాద్:  ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హుస్నాబాద్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ కాంప్లెక్స్‌లో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ పీఠభూమి ప్రాంతం కావడంతో సాధారణ పరిస్థితుల్లోనే వర్షాభావం ఉంటుందని, ఈసారి ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రతి శాఖ కార్యాచరణ ప్రణాళికతో పనిచేసి తాగునీటి సరఫరా, పశుగ్రాసం, భూగర్భ జలాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రైతులు వరికి బదులుగా మొక్కజొన్న, కందులు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఆయిల్‌పామ్ వంటి ఆరుతడి పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. విబిజీ రామ్‌జీ, తెలంగాణ జలసిరి పథకాల ద్వారా ఫామ్‌పాండ్లు, ఇంకుడు గుంతలు నిర్మించి ప్రతి వర్షపు చుక్కను సంరక్షించాలని సూచించారు. మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, గౌరవెల్లి ప్రాజెక్టు, శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, 250 పడకల ఆస్పత్రి, ఫోర్‌లైన్ రోడ్డు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని, హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగించాలని సూచించారు. సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లిస్తూ కంటింజెన్సీ ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా, నీటి సంరక్షణపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ పంటల మార్పిడి, ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/officers-of-all-departments-should-work-in-coordination/article-19639

Tags: