ప్లాస్టిక్ వద్దు.. స్టీల్  పాత్రలే ముద్దుఇనుగుర్తి టీచర్స్ స్టీల్ పాత్రల వాడకానికి శ్రీకారం

విశ్వంభర, ఇనుగుర్తి: ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం, డిస్పోజబుల్ గ్లాసుల్లో నీళ్లు తాగడం వద్దనుకున్నారు. మీటింగుల అనంతరం,శిక్షణలలో,ఫంక్షన్ లలో, ప్లాస్టిక్ వాడకం నిషేధించే విధంగా మెసేజ్ పంపడానికి శ్రీకారం చుట్టారు ఇనుగుర్తి మండల టీచర్స్. గురువారం మండల కేంద్రం ఇనుగుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఉపాధ్యాయులకు మండల స్థాయిలో మూడు రోజుల పాటు జరిగిన  ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ లో మధ్యాహ్నం భోజన సమయంలో మానవాళికి హానిక కలిగించే ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వాడవద్దనుకున్నారు.ఈ మేరకు స్టీల్ ప్లేట్లలో భోజనం చేసి స్టీల్ గ్లాసులతో మంచినీళ్లు తాగారు. ఇకనుంచి ఎప్పుడూ ప్లాస్టిక్ ప్లేట్లు క్లాసులు వాడమని భీష్మించారు.ఈసందర్భంగా టీచర్స్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన మానవ ఆరోగ్యానికి హానికరం తో పాటు పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. వేడి పదార్థాలు ప్లాస్టిక్ ప్లేట్లలో, చాయ్ కాఫీ వంటి వి కప్పులతో వాడినప్పుడు థాలెట్స్ వంటి ప్రమాదకర రసాయనాలు కరిగి మనలోనికి వెళ్తాయని దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు భూమిలో 100 సంవత్సరాలైనా కలిసిపోవని, పైగా నీరును భూమిలోకి ఇంక కుండా చేస్తాయన్నారు. అందుకే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/no-plastic-steel-utensils-are-a-kiss/article-19627

Tags: