కెప్టెన్ లక్ష్మి ఆశయాలతో యువత ముందుకు సాగాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: కెప్టెన్ లక్ష్మి సెహగల్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ విలువల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలి అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాదు బాగ్ లింగంపల్లి లో కెప్టెన్ లక్ష్మి సెహగల్ 14వ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి అధ్యక్షత వహించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ఎన్. ఆశలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్ పిలుపుతో 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరిన కెప్టెన్ లక్ష్మి సెహగల్ ఝాన్సీ రాణి రెజిమెంట్‌కు నాయకత్వం వహించి స్వాతంత్ర్య పోరాటంలో విశేష సేవలందించారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం మహిళల హక్కులు, సమానత్వం, కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని కొనియాడారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ, ఇందిర,కవిత, రెష్మ , వెంకటమ్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.