ఆగస్ట్ 5న చేనేత చైతన్య సభ

చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం. -తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్

ఆగస్ట్ 5న చేనేత చైతన్య సభ

విశ్వంభర, హుస్నాబాద్ :- చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కరీంనగర్ లో నిర్వహించబోయే చేనేత చైతన్య సభకు భారీ సంఖ్యలో చేనేత కార్మికులు తరలిరావాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ పిలుపునిచ్చారు. గురువారం హుస్నాబాద్లోని మార్కండేయ ఆలయం లో చైతన్యసభ పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాపోలు వీర మోహన్ మాట్లాడుతూ కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో గెలుపొందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులను సభలో ఘనంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు. సభలో రాష్ట్రంలోని చేనేత కార్మికుల ప్రస్తుత పరిస్థితులు, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ప్రముఖులు ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గం, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 5వ తేదీన కరీంనగర్లోని పద్మశాలీ కల్యాణ మం డపంలో చైతన్య సభ నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి జెల్ల రఘు నేత , వివిధ జిల్లాల బాధ్యులు గాజుల భగవాన్ నేత, చింతకింది శ్రీనివాస్, ఎలిగేటి శ్రీనివాస్, విజయలక్ష్మి, ఉమారాణి, కుమారస్వామి, శారద, ప్రభాకర్, కోటేశ్వర్, నాగభూషణం, లక్ష్మీపతి, రజిని, అరుణ్ తేజ్, లక్ష్మీనారాయణ, రమేష్, కనకయ్య తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు
🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cheneta-chaitanya-sabha-on-5th-august/article-19665

Tags: