ఆర్మీ భూమి ఆక్రమణపై హైడ్రాకు ఫిర్యాదు
విశ్వంభర, హైదరాబాదు : ఆర్మీకి చెందిన భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారాణి, వెంటనే నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని రక్షణ శాఖ అధికారులు హైడ్రాకు విజ్ఞప్తి చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీఎల్ఆర్ సర్వే నంబర్ 507లో ఉన్న ఆర్మీకి చెందిన ఏ-1 భూమిలో అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ జై సింగ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైదరాబాదు హైడ్రా కార్యాలయంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. భూమిని ఆక్రమించి అనుమతులు లేకుండానే జి ప్లస్ 2 భవన నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వినతిపత్రాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి ఆక్రమణలు నిర్ధారణ అయితే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో: ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ జై సింగ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.