ఏకలవ్యుని జయంతిని అధికారంగా నిర్వహించాలి
: తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి
విశ్వంభర, బషీర్ బాగ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఏకలవ్యుని జయంతి నిర్వహించాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, ఎరుకల కులస్తులు 6 లక్షలపైగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి కొరకు ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ పై ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చెయ్యాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎరుకల కులస్తులకు ప్రతి ఏడాది 10 కోట్లు కేటాయించాలని కోరారు. 33 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రానికి ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ప్రతి ఏడాది ఏకలవ్యుని జయంతి ఉత్సవాలను 5 రోజులపాటు జరుపుకోవాలని ఎరుకల కులస్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ఉపేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుతాడి అశోక్, తిరుపతి సంపత్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు నడిగడ్డ కుమారస్వామి, రేవెల్లి ఓదెలు, ఉండ్రాల ఎల్లయ్య, కెమసారం నగేష్, కెమసారం నాగేశ్వర్, మానుపాటి జయశంకర్, కోనేటి పోచయ్య, మల్లపూర్తి సాయిలు, ఎరుకలి బసప్ప, తెలంగాణ ఎరుకల మహిళ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి కోమల, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర రజిత, కోనేటి రమాదేవి, దాసరి విజయ, రెవెల్లి శారద, కట్ట జ్యోతి, ఉండాడి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.