కందుకూరు సిఐ వెంకటేశ్వర్లు కు పౌర సన్మానం
విశ్వంభర, బషీర్ బాగ్: ఇటీవల 10 లక్షల దోపిడీ కేసులో నిందితుల నుండి పది లక్షలు రికవరీ చేసి బాధితులు కందుకూరు మండలం అన్నోజిగూడ నివాసి ఢిల్లీ నారాయణకు తక్కువ సమయంలో తిరిగి ఇప్పించినందుకు తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, తెలంగాణ మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ కందుకూరు పోలీస్ స్టేషన్ కు విచ్చేసి శాలువతో సిఐ వెంకటేశ్వర్లకు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ పోలీస్ టీమ్ లోని కందుకూరు పోలీస్ స్టేషన్ ఎస్సై పరమేశ్వర, కానిస్టేబుల్ మహేష్, మల్లేష్, శేఖర్లకు సైతం అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంఘ సేవకులు కోరేళ్ళ చంద్రయ్య మహేశ్వరం మహేశ్వరం మండలం, హైకోర్టు న్యాయవాది గద్ద గూటి ఎట్టయ్య, ఢిల్లీ యాదయ్య, కటికల మహేందర్, కొరివి సురేందర్, శ్రీరాములు, పిసిసి కోఆర్డినేటర్ ఢిల్లీ శివకుమార్ పాల్గొన్నారు.