కొత్తపల్లి పాఠశాలలో ఎన్‌సీఎం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

విశ్వంభర, హాలియా: కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎన్‌సీఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు. అలాగే జడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్ కొత్తపల్లి పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు తిధి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి, హాలియా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల అభివృద్ధికి తమ ఫౌండేషన్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రమావత్ రామచంద్రయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎన్‌సీఎం ఫౌండేషన్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ncm-foundation-service-programs-at-kothapally-school/article-19572

Tags: