కేకే స్వర ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స 

విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్‌లోని కేకే స్వర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన "ట్రామాటిక్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా విత్ గ్యాస్ట్రిక్ పెర్ఫొరేషన్" కేసుకు వైద్యులు విజయవంతంగా అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో థొరాసిక్ సర్జన్ డా. అరుణ్ కనాల మాట్లాడుతూ, అత్యవసర లాపరోటమీ, థొరాకోటమీతో పాటు డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా రిపేర్, ఓమెంటల్ ప్యాచ్ రిపేర్ నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలో పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డా. శ్రీకాంత్ మోటే మాట్లాడుతూ, సమయానికి సరైన నిర్ధారణ, వైద్య బృందం సమన్వయం, ఆధునిక సాంకేతికతతో ఈ క్లిష్ట శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందించడం తమ ఆస్పత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా. ఎల్. సాయి భార్గవ్, డా. జి. క్రాంతి కిరణ్, డా. కృష్ణస్వామి తదితర వైద్యులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-rare-surgery-at-kk-swara-hospital/article-19599

Tags: