ప్రభుత్వ పాఠశాలలో ఏఐ డిజిటల్ ల్యాబ్ ప్రారంభం

విశ్వoభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్  మండలం ఎదులాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం  ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను గురువారం  ప్రారంభించారు. టీడీఎఫ్ అమెరికా అట్లాంటా చాప్టర్ సభ్యులు స్వాతి సుదిని, విక్రమ్ రెడ్డి సుదిని దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌లో ఐదు హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటర్లు, నెట్‌వర్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, "మన తెలంగాణ బడి" కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కొండాల వెంకట కృష్ణారెడ్డి బాలుర ప్రభుత్వ పాఠశాలకు మరో కంప్యూటర్ ల్యాబ్‌ను విరాళంగా అందజేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమం లొ  హెడ్ మాస్టర్ కృష్ణ కుమారి పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-of-ai-digital-lab-in-govt/article-19607

Tags: