నీట్ లీకేజీపై కేంద్రం బాధ్యత వహించాలి
విశ్వంభర, ముషీరాబాదు : నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ఢిల్లీలో జరిగిన ఘటనకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నప్పటికీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నీట్ పరీక్షల్లో చోటుచేసుకున్న లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని, పరీక్షా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయకుండా వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. నీట్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహించాలని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ గాయని చిన్మయి, రమా మేల్కొట్టి, సజయ, డి. స్వరూప, అంజు రావు, వసుధ నాగరాజ్, దీప్తి సిర్ల, రచయిత్రి భండారు విజయ, సామాజిక వేత్త విష్ణు తేజ, సాయిరాజు, పి.ఓ.డబ్ల్యూ. సంధ్య, ఝాన్సీ, పి.ఓ.డబ్ల్యూ. స్వరూప, భూమిక ఆర్గనైజేషన్ జ్యోతి రావు పాల్గొని సంఘీభావం తెలిపారు.