చిన్న వానకే 25వ వార్డు రోడ్డు చిత్తడి
- బురదలో కూర్చొని నిరసన తెలిపిన వార్డు కౌన్సిలర్ నర్రా సంధ్య శ్రావణ్
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 25వ వార్డు పరిధి సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ సంధ్య శ్రావణ్ బురదతో నిండి ఉన్న రోద్దు పై కూర్చొని నిరసన తెలిపారు ఈ సందర్భంగా సంధ్య శ్రావణ్ మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని నడవడానికి రోడ్లు సరిగా లేక బురదలో చాలా మార్లు జారీ పడడం జరిగిందని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వదిలేసిన వైనం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ అని అన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రారంభించిన శిలాఫలకాలు వార్డుకు దిష్టిబొమ్మల వేలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. పలు అభివృద్ధి పనుల మీద టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు నేటి వరకు జాడ పత్త లేకుండా పోయారని పలుమార్లు వాళ్లకు ఫోన్ చేసిన స్పందించలేని నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారని అయినా కూడా అట్టి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎందుకు మున్సిపల్ అధికారులకు అట్టి కాంట్రాక్టర్ పై ప్రేమ ఎందుకు అని అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు . అభివృద్ధి పనుల చేపట్టని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని టెండర్ను రద్దుచేసి రీ కాల్ చేసి నూతన టెండర్ ద్వారా కాంట్రాక్టర్లు పనులు అప్పజెప్పి త్వరగా రోడ్లు డ్రైన్లు వేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో దశలవారీగా పోరాటాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కమిటీ సభ్యులు మంద శంకర్ ,తండా శ్రీనాథ్, ఎండి రఫీ, మంచినీళ్ల రాకేష్, రాజు సురేష్, సమ్మక్క, ఉపేంద్ర, పుష్ప సుభద్ర, పరిమిల ,వసంత, తస్లీమా నసీమా, అనూష, పద్మ తదితరులు పాల్గొన్నారు.