విద్యార్థులపై లాఠీచార్జ్, కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం

విశ్వంభర,  చింతపల్లి :  ఢిల్లీలో విద్యార్థులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా చేపట్టిన నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని, వారికి మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ జటావత్ హరి నాయక్ విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం చింతపల్లి మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హరి నాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు కల్పించిందని, ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను బలప్రయోగంతో అణచివేయడం సమంజసం కాదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిరసనలను అణచివేసే ధోరణిని అవలంబించడం బాధాకరమని అన్నారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యతతో వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  దేశవ్యాప్తంగా పారదర్శక పరీక్షా విధానాన్ని అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,  జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల యాదగిరి, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు అంగీరేకుల నాగభూషణం, కాసారపు శ్రీనివాస్, ఊజ్జిని నరేందర్ రావు, ముద్దం మల్లేష్ గౌడ్, జితేందర్ రెడ్డి, సిద్దిక్ బాబా, జటావత్ శ్రీను, సలీం పాషా, గుణమోని కొండల్, గోవింద్ రవి, ఎలిమినేటి నర్సింహా, ఈరటి మల్లేష్, జాఫర్, అబ్బాస్, గునుకుల నరేష్, కోటేష్, రాము, పల్లె వెంకటయ్య, మెండే వెంకటయ్య, గొల్లపల్లి సర్పంచ్ ఆనంతుల శ్రీను, పంబలి వెంకటయ్య, రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/arrest-of-congress-leaders-for-baton-charge-against-students-is/article-19629

Tags: