కార్మిక సంక్షేమమే ప్రభుత్వాల బాధ్యత: రామన్న

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుని ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ కార్మిక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి రామన్న అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన తెలంగాణ కార్మిక సమాఖ్య రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కార్మికులకు 100 గజాల ఇంటి స్థలం కేటాయించి గృహాలు నిర్మించాలని, పోడు, సీలింగ్, లావణి పట్టా భూములకు పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, గ్రామ పంచాయతీ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో: జేఏసీ కన్వీనర్ కోలా జనార్ధన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు నెమలి పులి నాగమణి కె. లక్ష్మీ రత్న కుమారి పి. నారాయణ స్వరాజ్యం ముంతాజ్ బేగం దైదా సాగర్ ఈశ్వర్ గణేష్ జి. శేఖర్ ఎన్. నీలా రెడ్డి పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/labor-welfare-is-the-responsibility-of-governments-ramanna/article-19619

Tags: