ఇళ్ల మధ్య స్మశాన వాటిక వద్దు.. బడంగ్‌పేట కాలనీవాసుల ఆందోళన
- ఇళ్ల మధ్య వైకుంఠధామాన్ని తొలగించాలని బడంగ్‌పేట కాలనీవాసుల డిమాండ్.
- స్మశాన వాటిక వల్ల కాలుష్యం, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోపణ.
- జీహెచ్‌ఎంసీ, కలెక్టర్, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతి చేసినట్లు కాలనీవాసుల వెల్లడి.
Hyderabad News: బడంగ్‌పేట కాలనీకి సమీపంలో ఇప్పటికే విశాలమైన స్మశాన వాటిక ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ హయాంలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని వైకుంఠధామంగా మార్చారని స్థానిక కాలనీవాసులు ఆరోపించారు. దీంతో నివాస ప్రాంతం మధ్యలో శవదహనాలు నిర్వహించడం వల్ల పొగ, బూడిద, కాలుష్యం ఏర్పడి పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో నివసించే ప్రజల జీవించే హక్కుకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు.
కాలనీవాసుల కమిటీ నాయకురాలు జాంగ్రీ ఇందిరక్క మాట్లాడుతూ, ఈ సమస్యపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని అన్నారు. పార్కు స్థలాన్ని స్మశాన వాటికగా మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. స్మశాన వాటిక పనులను పునరుద్ధరించేందుకు వచ్చిన బుల్డోజర్‌ను కాలనీవాసులు అడ్డుకున్నారని తెలిపారు.
కాలనీలో శవదహనాలు నిలిపివేసి, వైకుంఠధామాన్ని వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాంగ్రీ ఇందిరక్కతో పాటు కాలనీలోని మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.