స్వీయ సంరక్షణ దినోత్సవం పై 108 ఈఎంఆర్ఐ అవగాహన
స్వీయ సంరక్షణతోనే గుండె జబ్బులు, స్ట్రోక్‌కు చెక్
విశ్వంభర, హుస్నాబాద్ : అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్‌లో 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ స్వీయ సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని తెలంగాణ రాష్ట్ర 108 అంబులెన్స్ సేవల కార్యనిర్వాహణ అధికారి బి. సుధాకర్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2026 జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్రంలో 17,940 ఛాతీ నొప్పి అత్యవసర కేసులు, 5,025 స్ట్రోక్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ముఖ్యంగా 30–40 ఏళ్ల వయస్సు వారిలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రక్తపోటు, రక్తంలో చక్కెర, లిపిడ్ ప్రొఫైల్ వంటి ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండడం, యోగా, ధ్యానం చేయడం అలవర్చుకోవాలని సూచించారు. అలాగే తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, డిజిటల్ డిటాక్స్, కుటుంబ సభ్యులతో సమయం గడపడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే 108 అంబులెన్స్ సేవలకు కాల్ చేయడం కూడా ఉత్తమ స్వీయ సంరక్షణ చర్యేనని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి ఆరోగ్యకర జీవనశైలిని పాటించాలని పిలుపునిచ్చారు.