ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
విశ్వంభర, కాచిగూడ : హైదరాబాదు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధి సత్యనగర్‌లో గురువారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్ యాసీన్ (46) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురైన ఆయన ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి గది తలుపు లోపల నుంచి గడియ వేసి ఉండటంతో స్థానికుల సహాయంతో తలుపు తెరిచి చూడగా యాసీన్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని పోలీసులు తెలిపారు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.