ఆగస్టు 5న కరీంనగర్‌లో తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభ
- చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం
- రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్
విశ్వంభర, హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభ పోస్టర్‌ను హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్, కోశాధికారి రఘు, రాష్ట్ర, జిల్లా నాయకులు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాపోలు వీర మోహన్ మాట్లాడుతూ, కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో గెలుపొందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులను సభలో ఘనంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు. సభలో రాష్ట్రంలోని చేనేత కార్మికుల ప్రస్తుత పరిస్థితులు, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ప్రముఖులు ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గం, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర, వివిధ జిల్లాల బాధ్యులు గాజుల భగవాన్ నేత, చింతకింది శ్రీనివాస్, ఎలిగేటి శ్రీనివాస్, విజయలక్ష్మి, ఉమారాణి, కుమారస్వామి, శారద, ప్రభాకర్, కోటేశ్వర్, నాగభూషణం, లక్ష్మీపతి, రజిని, అరుణ్ తేజ్, లక్ష్మీనారాయణ, రమేష్, కనకయ్య తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.