శ్రీవాణి ట్రస్ట్ నిధుల విడుదలకు లంచం.. అనంతపురంలో ఏసీబీ రైడ్
- అనంతపురం దేవాదాయ శాఖలో ఏసీబీ దాడులు.. రూ.25 వేల లంచం తీసుకుంటూ అసిస్టెంట్ కమిషనర్ పట్టివేత.
- లంచం కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏసీబీకి చిక్కాడు
Anantapuram ACB Raid: అనంతపురం జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. పుట్లూరు మండలం రామలింగేపల్లి గ్రామంలోని ఆలయ నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షలు మంజూరయ్యాయి. అందులో తొలి విడతగా రూ.2 లక్షల నిధులు విడుదల చేయడానికి ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి నుంచి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో మల్లికార్జున ప్రసాద్‌ను పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, మల్లికార్జున ప్రసాద్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నట్లు సమాచారం.