11వ అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడలు ప్రారంభం
విశ్వంభర, గచ్చిబౌలి : గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం 11వ అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్–2026 క్రీడా పోటీలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అతిధులను ఆకట్టుకున్నవి. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.