ఆర్పీఐ (అథవాలే) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నేనే: పసుల రవికుమార్

విశ్వంభర, హైదరాబాద్ (బషీర్‌బాగ్): రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తానే గత మూడేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పసుల రవికుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పేరం శివనాగేశ్వరరావు గౌడ్ చెలామణి అవుతుండటాన్ని తీవ్రంగా ఖండించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను ఆర్పీఐ (అథవాలే) పార్టీలో పదేళ్లుగా పనిచేస్తున్నానని, మూడేళ్లుగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని తెలిపారు.  పార్టీ పదవులను దుర్వినియోగం చేస్తూ పార్టీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడం, కార్యకర్తలను బెదిరించడం లేదా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారికి పార్టీలో స్థానం ఉండదని హెచ్చరించారు. తెలంగాణలో పార్టీకి స్థానికులే నాయకత్వం వహించాలని, రాష్ట్ర ఇన్‌చార్జి కూడా స్థానికుడే ఉండాలని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి తెలంగాణ విభాగంలో ఎలాంటి పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అలాంటి వారిని ప్రోత్సహించే వారిని కూడా పార్టీ ద్రోహులుగా పరిగణిస్తామని అన్నారు. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో పదివేల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు కేంద్ర మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథవాలే ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘుముద్రి పీటర్ నాయుడు, ఉపాధ్యక్షులు బానోతు రవి, బీసీ సెల్ అధ్యక్షుడు రాముకుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్నేహలత, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సునీల్, ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/my-name-is-pasula-ravikumar-rpi-athavale-telangana-state-president/article-19601

Tags: