అంబాలలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గొంగిడి సునీత రెడ్డి

విశ్వంభర, గుండాల: గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన దేశపాక అశోక్ ఇటీవల పాము కాటుకు గురై మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గురువారం బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటనపై ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ ఖలీల్, గ్రామ ఉపసర్పంచ్ బీసు ప్రశాంత్, జక్కుల యాదయ్య, మాజీ ఎంపీటీసీ పొన్నగాని మహేష్, వార్డు సభ్యుడు మధు, మహేష్, నర్సింహ, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ భిక్షమయ్య, రాములు, లోడె ప్రవీణ్, మహేందర్ రెడ్డి, రమేష్, ఉపేందర్, శ్రీనివాస్ రెడ్డి, యాదిరెడ్డి, నర్సయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gongidi-sunitha-reddy-visited-the-victims-family-in-ambala/article-19647

Tags: