సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు
విశ్వంభర, షాద్‌నగర్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు సూచించారు. గురువారం ఫరూక్‌నగర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన వర్షాకాల అత్యవసర ప్రణాళిక సమీక్ష సమావేశంలో సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఏఈఓలకు ఆరోగ్య అవగాహన కల్పించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిల్వ నీటిలో దోమలు పెరిగి మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయని హెచ్చరించారు. వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీకాంత్, వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్, ఇతర అధికారులు, సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.