పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
: పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి: కుల్కచర్ల మండల పరిధిలోని బండవేల్కిచర్ల గ్రామంలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్‌గా మైపాల్ రెడ్డి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మైపాల్ రెడ్డి పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవాలయ అభివృద్ధికి అంకితభావంతో సేవలందించాలని ఆకాంక్షించారు.పాంబండ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ఆధ్యాత్మికత మనిషికి మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిగి నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.కుల్కచర్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ భీమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్, చౌడపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ సత్య హరి చందర్, సర్పంచ్ శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు అంజలయ్య గౌడ్, శివరాం నాయక్, రవీందర్ నాయక్, నరేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు, పాల్గొన్నారు.